Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవాంకాను సన్నీలియోన్‌తో పోల్చిన రామ్ గోపాల్ వర్మ (వీడియో)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాదులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 28న హైదరాబాదులో జరగబోయే గ్లోబల్ ఎంట్రాప్రెన్సూర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు ఆమె నగరానికి విచ్చేయనున్

Advertiesment
Ram Gopal Varma compares Ivanka Trump with Sunny Leone
, సోమవారం, 20 నవంబరు 2017 (16:48 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాదులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 28న హైదరాబాదులో జరగబోయే గ్లోబల్ ఎంట్రాప్రెన్సూర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు ఆమె నగరానికి విచ్చేయనున్నారు. ఇవాంకా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఆమెను సన్నీలియోన్‌తో పోలుస్తూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్లు గుప్పించాడు. ఇవాంకాను బాలీవుడ్ నటి సన్నీలియోన్‌తో పోలుస్తూ.. వర్మ ఫేస్‌బుక్‌లో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 
తనకు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదన్న వర్మ.. రాజకీయ రంగంలో తనకు జ్ఞానం కూడా లేదన్నాడు. అసలు ఇవాంకా హైదరాబాద్‌లో పర్యటించడానికి గల ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు. కానీ తాను మాత్రం ఇవాంకా రియల్ అందాన్ని చూడాలని ఎంతోగానూ ఎదురుచూస్తున్నానని తెలిపారు. 
 
గతంలో భారత్‌కు శృంగార తార సన్నీలియోన్ వచ్చినప్పుడు కూడా తాను ఇలాగే హ్యాపీగా ఫీలయ్యానని వర్మ తన ఫేస్ బుక్ పోస్టులో చెప్పారు. ఇకపోతే.. ఇవాంక హైదరాబాదులో జరిగే సదస్సులో హాజ‌రుకానున్న సందర్భంగా భారీ వ్యయంతో హైదరాబాద్‌ను జీహెచ్ఎంసీ ముస్తాబు చేస్తోంది. వీవీఐపీలు తిరిగే జోన్లో కొత్త‌ రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తులు, ఫుట్‌పాత్‌లు, గార్డనింగ్ పనులు ఇలా అనేక అభివృద్ధి ప‌నులు చేపట్టింది. 
 
ముఖ్యంగా సదస్సు జరిగే హైటెక్‌సిటీలో పనులు వేగంగా జరుగుతున్నాయి.. ఇవాంకా కోసం తాజ్‌ ఫలక్‌నుమాప్యాలెస్‌లో ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఇవాంకా ట్రంప్ వస్తుండటంతో భారీ ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శింబు, త్రిష, వడివేలుపై నిర్మాతల మండలి యాక్షన్?