టాలీవుడ్ యువ హీరో నితిన్ వివాహం లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా వివాహాలన్నీ చాలా సింపుల్‌గా జరిగిపోతున్న సంగతి విదితమే. ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతున్నా నిబంధనలు పాటిస్తూ అతి తక్కువమంది సమక్షంలో ఇప్పటికే మరో యాక్టర్ నిఖిల్ సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నాడు.
మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా లాక్‌డౌన్‌లో రెండో వివాహం చేసుకున్నారు. నితిన్ కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ నితిన్ తన పెళ్లిని సింఫుల్‌గా చేసుకునేందుకు రెడీగా లేడట.
ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగే వరకు పెళ్లికి సమయం తీసుకోవాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అవసరమైతే తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవాలని కూడా భావిస్తున్నాడట.