Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనటుడుతో పూజా కుమార్ డేటింగ్??!

Webdunia
మంగళవారం, 26 మే 2020 (18:28 IST)
విశ్వనటుడు కమల్ హాసన్. ఈయన తాజా చిత్రం ఇండియన్-2. కొన్ని అవాంతరాల కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అయితే, ప్రస్తుతం ఈయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఆతర్వాత గౌతమితో సహజీవనం చేశారు. ఇపుడు నటి పూజా కుమార్‌తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్‌తో కలిసి పూజా కుమార్ విశ్వరూపం మొదటి భాగం, రెండో భాగం చిత్రాలతో పాటు.. ఉత్తమ విలన్ చిత్రాల్లో నటించింది. దీంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడి, అది లివింగి రిలేషన్‌షిప్‌కు దారితీసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. 
 
వీటిపై పూజా కుమార్ స్పందించారు. 'చాలా కాలం నుంచి కమల్‌ హాసన్‌​, ఆయన కుటుంబ సభ్యులు నాకు బాగా తెలుసు. కమల్‌తో కలిసి సినిమాలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయన కుటుంబం, వాళ్ల పిల్లలు శ్రుతి, అక్షర హాసన్‌లు అందరూ పరిచయం. అందుకే వారితో సాన్నిహిత్యంగా ఉంటాను' అని చెప్పుకొచ్చింది. 
 
అంతేకానీ, కమల్ హాసన్‌తో తాను లివింగ్ రిలేషన్‌లో, డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. ఇకపోతే, పూజా కుమార్ అమెరికాలోని మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు. ఈమె పలు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడితో పారిపోయిన అత్త.. పిల్లల కోసం వచ్చేయమని భర్త వేడుకున్నా..?

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments