Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా నటించడం కంటే ఐటమ్ సాంగులే బెటర్ : హంసా నందిని

Webdunia
మంగళవారం, 26 మే 2020 (16:40 IST)
మోడల్ నుంచి సినీ నటిగా కెరీర్‌ను ప్రారంభించిన మరాఠీ భామ హంసానందిని. ఈమె అసలు పేరు పూనమ్. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఆన పేరును మార్చుకుంది. 2004లో వచ్చిన "ఒక్కటవుదాం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2018లో వచ్చిన "పంతం" చిత్రం తర్వాత ఈ మహారాష్ట్ర భామ వెండితెరపై కనిపించలేదు. దీనికి గల కారణాలను ఈ ముద్దుగుమ్మ తాజాగా వెల్లడించింది. 
 
మొదటి నుంచి తనకు సినీ కెరీర్‌లో రొటీన్ పాత్రలే వచ్చాయని చెప్పింది. అలాంటి పాత్రలు చేయడం ఇష్టంలేకే ఐటమ్ సాంగుల వైపు దృష్టి మళ్లించినట్టు చెప్పుకొచ్చింది. ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్రల కంటే ఐటెం సాంగులే బెటర్ కదా అని ప్రశ్నించింది. 
 
స్పెషల్ సాంగులు రొటీన్‌కు భిన్నంగా వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని చెప్పింది. తనకు సాంగ్స్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని... అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని తెలిపింది. 
 
మరోవైపు తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన హంసానందిని ఇపుడు ఐటమ్ సాంగులకే పరిమితమైంది. ఎన్నో సినిమాల్లో తన ఐటెం సాంగుల ద్వారా ఆమె ప్రేక్షకులను మైమరపించింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఆమె ఇంటికే పరిమితమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments