నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ రాబిన్‌హుడ్ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. మే10 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను ఓటీటీలో చూసి ఉర్రూత లూగించే సాహసానికి సిద్ధం కావాలని మేకర్స్ భావిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సస్పెన్స్, ట్విస్ట్స్, ఎవరూ ఊహించలేని మలుపులతో సాగే కథనంతో ఆకట్టుకుంటుంది.
రాబిన్‌హుడ్ చిత్రం నేరానికి అధికారం తోడైతే ఎంత శక్తివంతంగా ఉంటుందో ఆ శక్తిని తెలియజేసే నేర ప్రపంచానికి ప్రేక్షకులను సరికొత్తగా తీసుకెళుతుంది.
కథ విషయానికి వస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ, తెలివైన యువకుడు. కొన్ని పరిస్థితుల కారణంగా తనొక రాబిన్‌హుడ్‌గా మారి ధనవంతుల నుంచి డబ్బను దొంగిలించి అవసరమైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యానికి రాజమైన వ్యక్తితో తలపడాల్సి వస్తుంది. అక్కడి నుంచి రామ్ కథ ప్రమాదకరమైన మలుపు తీసుకుంటుంది. తను నీరా (శ్రీలీల)తో కలిసి అత్యంత ప్రమాదకరమైన దొంగతనాలు, ప్రాణాంతకమైన సవాళ్లను ఎదుర్కొనటానికి సిద్ధమవుతాడు. అంతా బాగుందని భావిస్తున్న తరుణంలో కథ అతి పెద్ద ట్విస్ట్ తిరుగుతుంది. అప్పుడు రామ్, నీరా ఏం చేశారు? సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే ట్విస్ట్ ఏంటి? అనే అంశాలు ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠతకు లోను చేస్తాయి.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ, ఈ ప్రయాణంలో ఇప్పుడు ZEE5 కలిసి రావటం ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి భాగస్వామ్యాలతో మరిన్ని సినిమాలను చేయాలనుకుంటున్నాను. కేవలం దొంగతనాలు, ఎమోషన్స్, నాటకీయతకు సంబంధించిన కథ మాత్రమే కాదు. సమాజంలో జరిగే తప్పులను సరిదిద్దటానికి ఓ బాటను ఎంచుకున్న మనిషి గురించి కథ. ఉత్కంఠతతో సాగే ఈ సినిమాను జీ5లో ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ, యాక్షన్, డ్రామా, ఊహించని ట్విస్ట్‌లతో రోలర్‌కోస్టర్‌లా అందరినీ అలరిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రాబిన్‌హుడ్ మెప్పిస్తుంది అన్నారు.
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ, డైరెక్టర్ వెంకీ కుడుములతో కలిసి సినిమా చేయటం అనే కల ఈ చిత్రంతో నేరవేరింది. ఆయన విజన్ మా అందరిలో బెస్ట్ ఔట్‌పుట్ తీసుకొచ్చింది. కథలో యాక్షన్, ఎమోషన్స్, కామెడీ వంటి అంశాలను సినిమాగా మలిచిన తీరు చాలా చక్కగా ఉంది. థియేటర్స్‌లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు జీ5లో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతుంది. ఊహించని ట్విస్టులతో, మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కథతో సినిమా తెరకెక్కింది. ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం కావటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.