Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ సురవరం చిత్రం టీజర్ విడుదలైంది...(Video)

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (18:55 IST)
హ్యాపీడేస్ చిత్రంతో రాజేష్ పాత్రతో మనకు గుర్తిండిపోయాడు హీరో నిఖిల్ సిద్ధార్థ. నిఖిల్ వరుసగా కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా తదితర హిట్ చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నాడు, తాజాగా అర్జున్ సురవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతంలో ఈ చిత్ర టైటిల్ ముద్ర కోసం నిర్మాత నట్టి కుమార్‌తో గొడవపడి చివరికి ఒక అడుగు వెనక్కి వేసి అర్జున్ సురవరంగా పేరు మార్చుకున్నాడు. 
 
ఈ చిత్రం తమిళ సినిమా కణిథన్‌కు రీమేక్‌గా వస్తోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రం టీజర్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. అబద్దాన్ని నిజం చేయడం చాలా సులభం..కానీ నిజాన్ని నిజంగా నిరూపించడం చాలా కష్టం అంటూ వచ్చే సంభాషణలతో ప్రారంభమయే టీజర్ అద్భుతంగా ఉంది. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుంది. అర్జున్ సురవరం చిత్రం విజయం సాధిస్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments