Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆశ్చర్యపరిచే 'అంతరిక్షం' : టాలీవుడ్‌లో గొప్ప ప్రయత్నం (మూవీ రివ్యూ)

ఆశ్చర్యపరిచే 'అంతరిక్షం' : టాలీవుడ్‌లో గొప్ప ప్రయత్నం (మూవీ రివ్యూ)
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (16:32 IST)
మూవీ : 'అంతరిక్షం' 
నటీనటులు : వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల.
నిర్మాణ సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్
ద‌ర్శ‌కుడు: స‌ంక‌ల్ప్ రెడ్డి
నిర్మాత‌లు: రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
విడుద‌ల‌: శుక్రవారం డిసెంబరు 21, 2018
గతంలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఘాజీ". ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అప్పటివరకు సంకల్ప్ రెడ్డి గురించి ఏ ఒక్కరికీ తెలియదు. 'ఘాజీ' తర్వాత సంకల్ప్ రెడ్డి ప్రతిభ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇపుడు వరుణ్ తేజ్ హీరోగా నిర్మించిన చిత్రం 'అంతరిక్షం'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం కథ ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.
 
కథ : 
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహం మిహిర నిర్దేశిత కక్ష్యలోకి కాకుండా కక్ష్య మారుతుంది. దీని వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా క‌మ్యూనికేష‌న్ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ఇస్రో దీన్ని స‌రిచేసే ప‌నిలో ప‌డుతుంది. అయితే దాన్ని స‌రిచేసే వ్య‌క్తి ఎవ‌రా? అని ఆలోచిస్తే వారికి దొరికే స‌మాధానం దేవ్‌(వ‌రుణ్ తేజ్‌). అయితే దేవ్ కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల సెల‌వుపై ఉంటాడు. అత‌నెక్క‌డుంటాడో ఎవ‌రికీ తెలియ‌దు. దాంతో శాస్త్రవేత్త‌లు ఏం చేయాల‌ని ఆలోచిస్తారు. చివ‌ర‌కు రియా(అదితిరావు హైద‌రి) రంగంలోకి దిగి దేవ్ అచూకీ క‌నిపెడుతుంది. అత‌న్ని అంత‌రిక్షంలోకి వెళ్ల‌డానికి ఎలా ఒప్పిస్తుంది? చివ‌ర‌కు దేవ్ అంతరిక్షంలోకి వెళ్లి ఏం చేశాడు? స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాడా? లేదా అన్నదే మిగిలిన చిత్ర కథ. 
 
కథా విశ్లేషణ : 
సాధార‌ణంగా హాలీవుడ్‌లో జేమ్స్ బాండ్ సినిమాల్లో హీరో క‌న‌ప‌డ‌కుండా ఉంటాడు. అత‌న్ని వెతికి ప‌ట్టుకుని ప్రాజెక్ట్ అప్ప‌గించ‌డం అనే స్టైల్లో ఈ ఈ చిత్ర కథ సాగుతుంది. తన వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల హీరో సెల‌వుల్లో ఉంటాడు. అతన్ని ప‌ట్టుకుని ప్రాజెక్ట్ అప్ప‌గిస్తారు. దేవ్ పాత్ర‌లో వ‌రుణ్‌తేజ్ చ‌క్క‌గా ఒదిగిపోయాడు. అస్ట్రానాయిడ్ పాత్ర‌లో హుందాగా న‌టించాడు. అదితిరావ్ హైద‌రీ.. లేడీ అస్ట్రనాయిడ్‌గా, దేవ్‌ను గోల్ వైపు మ‌ళ్లించే పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించింది. స‌త్య‌దేవ్ డ్యూయెల్ రోల్‌లో న‌టించాడు. అవ‌స‌రాల శ్రీనివాస్ పాత్ర ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్‌లో న‌టించాడు. రెహ‌మాన్‌, లావ‌ణ్య త్రిపాఠి త‌దిత‌రులు వారివారి పాత్ర‌లమేర చ‌క్క‌గా న‌టించారు. 
 
టెక్నికల్ పరంగా : 
ఘాజీ చిత్రంతో తెలుగు సినిమాను కొత్త మ‌లుపు తిప్పిన ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్‌ రెడ్డి. రెండో సినిమా ఎలా ఉంటుందోన‌ని అంద‌ర‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. అంద‌రి ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా "అంత‌రిక్షం" అనే టైటిల్ పెట్టి తొలి టాలీవుడ్ స్పేస్ మూవీని తెర‌కెక్కించాడు. రూ.25-30 కోట్ల బ‌డ్జెట్‌లో హాలీవుడ్ స్థాయిలో తెలుగు మూవీని చేశాడంటే అది అతని ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీతో సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాడు. గ్రాఫిక్స్ చాలా బాగా చేశాడు. పాట‌లు క‌థానుగుణంగా ఉన్నాయి. అయితే, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులకు సినిమా న‌చ్చ‌దు. అయితే కొత్తగా ప్రయత్నం చేసిన యూనిట్‌ను, ద‌ర్శ‌కుడి టేకింగ్‌, గ్రాఫిక్స్‌, నిర్మాణ విలువ‌ల‌ను అభినందించాల్సిందే.
 
చివ‌ర‌గా అంతరిక్షం తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప ప్రయత్నంగా చెప్పొచ్చు. ఈ చిత్రానికి కథాంశం, సినిమా బ్యాక్‌డ్రాప్, గ్రాఫిక్స్, సినిమా రెండో భాగంలో ఎమోషనల్సీన్స్ సూబర్బ్‌గా ఉన్నాయి. అలాగే, ఈ చిత్రం నేల టిక్కెట్ ప్రేక్షకులకు నచ్చదు. మల్టీప్లెక్స్ మూవీగా మిగిలిపోనుంది. అలాగే కమర్షియల్ సినీ ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కాకపోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పడిపడి లేచె మనసు'ను చూస్తుంటే అలా అనిపిస్తోందట... రివ్యూ