Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిహారిక సూర్య‌కాంతం చిత్ర ఫస్ట్ లుక్ లాంఛ్ చేసిన వ‌రుణ్ తేజ్..!

Advertiesment
నిహారిక సూర్య‌కాంతం చిత్ర ఫస్ట్ లుక్ లాంఛ్ చేసిన వ‌రుణ్ తేజ్..!
, బుధవారం, 19 డిశెంబరు 2018 (10:11 IST)
నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్ జంట‌గా తెర‌కెక్కుతున్న ఎంట‌ర్ టైన‌ర్ సూర్యాకాంతం. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ లాంఛ్ చేసాడు. నిహారిక పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ లుక్ విడుద‌ల చేసారు చిత్ర‌ యూనిట్. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈయ‌న గ‌తంలో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసారు. నిహారిక‌తో వెబ్ సిరీస్ కూడా తెర‌కెక్కించారు గ‌తంలో. ఫ‌స్ట్ లుక్‌లో ఓ వైపు ప్రేమ చూపిస్తూనే.. మ‌రో వైపు గొడ‌వ ప‌డుతున్నారు నిహారిక‌, రాహుల్. ఈ లుక్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. 
 
సూర్యాకాంతం షూటింగ్ పూర్తైపోయింది.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో శివాజీ రాజా, సుహాసిని కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌ముఖ యుఎస్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ సూర్యాకాంతం సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు.
 
నిహారిక కొణిదెల‌, రాహుల్ విజ‌య్, పెర్లేనె భెసానియా, శివాజీ రాజా, సుహాసిని, స‌త్య త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు: ప‌్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి, నిర్మాత‌లు: స‌ందీప్ యెర్రం రెడ్డి, సృజ‌న్ యెర్ర‌బాబు, రామ్ న‌రేష్, నిర్మాణ సంస్థ‌: నిర్వాణ సినిమాస్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: రాజ్ నిహార్, సినిమాటోగ్ర‌ఫ‌ర్: హ‌ర్జీ ప్ర‌సాద్, సంగీతం: మార్క్ కే రాబిన్, ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్ల, లిరిక్స్: కృష్ణ కాంత్, ఎడిట‌ర్: ర‌వితేజ గిరిజ‌ల‌, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుణ్‌ ముఖ్యంకాదు... సినిమాపై ఉన్న గౌరవంతో వచ్చా.. చెర్రీ