Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తికేయ 2 ఆరంభంలోనే ఆగిందా..? నిజమేనా..?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (20:58 IST)
నిఖిల్ కెరీర్లో మరచిపోలేని సినిమా కార్తికేయ. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించారు. అయితే.. ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని అప్పుడే అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆ తర్వాత నిఖిల్, చందు వేరే సినిమాల్లో బిజీ కావడం వలన కుదరలేదు. 
 
ఈమధ్య నిఖిల్ - చందు కలిసి కార్తికేయ 2 సినిమా చేయాలనుకున్నారు. ఈ క్రేజీ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో ఈ సినిమాని గ్రాండ్ లాంచ్ చేయడం కూడా జరిగింది. అయితే.. ఈ సినిమా స్టార్ట్ అయిన కొన్ని రోజుల నుంచే బడ్జెట్ విషయంలో డైరెక్టర్‌కి, చిత్ర నిర్మాతలకు మధ్య డిఫరెన్సస్ వచ్చాయి. అందుచేత ఈ సినిమా ఆరంభంలోనే ఆగింది అంటూ వార్తలు వచ్చాయి. 
 
అలాగే డైరెక్టర్ వేరే నిర్మాతలకు ఈ సినిమా చేయాలనుకుంటున్నాడని కూడా టాక్ వినిపించింది. అయితే... ప్రచారంలో ఉన్న ఈ వార్తలను ఖండించడం కోసం అనుకుంట.. ఏప్రిల్ నుంచి కార్తికేయ 2 షూటింగ్‌ని మొద‌లుపెట్ట‌డానికి లొకేష‌న్స్ రెక్కీని ప్రారంభించారు ద‌ర్శ‌కుడు చందుమొండేటి, సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని అంటూ ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు చిత్ర నిర్మాతలు. 
 
ఈ థ్రిల్లింగ్ ఎంట‌ర్టైన‌ర్‌కు టీ.జి విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాత‌లు. ఈ సినిమాపై చందు మొండేటి చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. సవ్యసాచితో సక్సెస్ సాధించలేకపోయిన చందు కార్తికేయ 2 సినిమాతో సక్సెస్ సాధించి మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments