గర్ల్ ఫ్రెండ్ వివరాలు బయటపెట్టిన నిఖిల్-పుట్టబోయే బిడ్డ పేరేంటో తెలుసా...?

గురువారం, 17 అక్టోబరు 2019 (18:57 IST)
హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఎనర్జిటిక్ స్టార్ నిఖిల్ ఆ తర్వాత నటించిన స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న నిఖిల్ ఇటీవల మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తున్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ షోలో పాల్గొన్నాడు. అందులో తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను ఆమెతో పంచుకున్నాడు.
 
ప్రేమ, పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.. చిన్నప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలు చూసినప్పుడు నేను కూడా ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకునేవాడిని. అయితే ఇంతవరకు నాకు ఆ అవకాశం రాలేదు. కానీ మూడు నెలల క్రితం ఓ అమ్మాయి నచ్చింది. ఆమె వృత్తిరీత్యా ఒక డాక్టర్... తన పనిలో తను ఉంటుంది తప్ప నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయదు.. షూటింగ్‌లో ఉండే ఫోన్ చేయదు, ఎప్పుడూ నా ఫోన్ చెక్ చెయ్యదు.

పార్టీలకు వెళ్లినా, ఫ్రెండ్స్‌తో ఉన్నా ఏమనదు.. లేట్ చేసినా తిట్టదు అంటూ తనకు కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు. తనకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమని, తన చెల్లెలి కూతరు కూడా తన దగ్గరే ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక నాకు తప్పకుండా పాపే పుట్టాలని, ఆ పాప పేరు కూడా ఫిక్స్ చేశానంటూ.. మాయా సిద్దార్థ్ అంటే ఎంత బాగుంది కదా అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రణతితో వైవాహిక జీవితం ముగిసిపోయింది.. మంచు మనోజ్ షాక్