Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త - నా నోట మాట రాలేదు- మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (16:30 IST)
Puneeth Rajkumar
కన్నడ సినీ పరిశ్రమ ఒక స్టార్ హీరోను కోల్పోయింది. శుక్రవారం నాడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్ గుండె పోటు కారణంగా మరణించారు. జిమ్ చేస్తుండగా  ఆయనకు గుండె పోటు రావడంతో విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. పునీత్ మృతికి కేవలం శాండిల్ వుడ్ నుంచే కాక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

 
ప్ర‌ముఖులు నివాళి
 
పునీత్ మ‌ర‌ణ వార్త విన‌గానే తెలుగు సినీ రంగానికి చెందిన వైజ‌యంతీ మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. మొద‌ట న‌మ్మ‌లేక‌పోయాన‌ని పేర్కొంటూ చ‌ల‌న‌చిత్ర‌రంగంలో విషాదం నెల‌కొంది. పునీత్  కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా ప్ర‌ముఖ నిర్మాత నాగ‌వంశీ, ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ త‌దిత‌రులు పునీత్ కుటుంబానికి సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

 
చిరంజీవి 
పునీత్ మృతి చెందిన విషయం మీద మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ "ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. పునీత్ మరణం రాజ్ కుమార్ గారి కుటుంబానికి తీరని లోటు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పునీత్ తనకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా తనను పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే నా నోట మాట కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి.

 
క‌న్న‌డ కంఠీర‌వ దివంగ‌త రాజ్‌కుమార్ త‌న‌యుడు పునీత్ మ‌ర‌ణం నన్ను షాక్‌కి గురి చేసింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ ప‌ర‌మేశ్వ‌రుని కోరుతున్నాను. చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. ఎన్నో పుర‌స్కారాలు సంపాదించుకుని తండ్రి అడుగుజాడ‌లో న‌డిచి ఇలా అర్థంత‌రంగా కాలం చేయ‌డం క‌ల‌చివేసింద‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments