Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

దేవీ
మంగళవారం, 20 మే 2025 (17:28 IST)
Mirayai tej sajja
సూపర్ హీరో తేజ సజ్జా తన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ తరవాత ఇప్పుడు మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
 
తాజాగాఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ముంబయి లోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ సజ్జాతో పాటు కొన్ని ప్రధాన పాత్రల నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. సినిమాకు సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి, ఆగస్టులో రిలీజ్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో, 2D,  3D ఫార్మాట్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
తేజ సజ్జా ఈ చిత్రంలో సూపర్ యోధ పాత్ర కోసం మరోసారి కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్‌గా, రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన తేజ సజ్జా, మనోజ్ మంచు ఫస్ట్ లుక్ పోస్టర్లు, స్పెషల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
 
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లేను కూడా అందించగా, మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. గౌరహరి సంగీతం అందించగా, శ్రీ నాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వివేక్ కుచిభొట్ల కో-ప్రొడ్యూసర్ కాగా, కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments