Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు... వివరాలు ఇవే..

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (08:14 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు వచ్చాయి. ఇవి ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకిరానున్నాయి. ఈ మేరకు తెలుగు చిత్రాల నిర్మాతల మండలి (టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్) సమ్మతం రూపొందించింది. గత నెల 25వ తేదీ నంచి టాలీవుడ్‌లో చిత్రీకరణలు మొదలైన విషయం తెల్సిందే. ఈ నెల ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో షూటింగులు జరుగుతున్నాయి. దీంతో చిత్రపరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణఆలకు సంబంధించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త మార్గదర్శకాలను విడుదలచేసింది. ఆ వివారలను పరిశీలిస్తే,
 
సినిమా నిర్మాణం..
* ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రోజువారీ చెల్లింపులు ఉండవు. 
* ఓ చిత్రం, అందులోని పాత్రల స్థాయిని ఆధారంగా నటీనటుల పారితోషికాలను నిర్మాతలు నిర్ణయిస్తారు. ఆ పారితోషికంలోనే నటీనటుల పర్సనల్ స్టాఫ్, స్థానిక రవాణా, స్థానిక బస, స్పెషల్ ఫుడ్ వంటి ఇతర ఖర్చుల ఇమిడివుంటాయి. 
* ఓ ఆర్టిస్టుతో కుదుర్చుకున్న పారితోషికం ఒప్పందానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.
 
* ఓ సినిమాకు పనిచేసే ప్రధాన టెక్నీషియన్ల పారితోషికాల్లో వారి పర్సనల్ స్టాఫ్ ఖర్చులు, స్థానిక బస, స్థానిక రవాణా, స్పెషల్ ఫుడ్ వంటి ఖర్చులు కూడా ఇమిడివుంటాయి. ముందు ఒప్పందం కుదుర్చుకున్న మేరకు తప్ప నిర్మాత అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. 
* ప్రతి ఒప్పందంలోనూ పారితోషికం వివరాలను ఖచ్చితంగా ఉండాలి. ఆ వివరాలను చాంబర్ ముందు ఉంచాలి. 
 
ఓటీటీ..
* ఓ సినిమా టైటిల్‌లో, థియేట్రికల్ రిలీజ్ ప్రచారంతో ఓటీటీ, శాటిలైట్ భాగస్వాముల పేర్లు ఉండవు. 
* ఒక సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీకీ ఇవ్వాల్సి ఉంటుంది. 
 
థియేటర్లు/ఎగ్జిబిటర్ల అంశాలు.. 
* వీపీఎఫ్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయ. సెప్టెంబరు 3న జరగాల్సిన తదుపరి సమావేశం 6వ తేదీకి వాయిదా పడింది. 
* తెలంగాణాలో ఇచ్చినంత పర్సంటేజీనో ఆంధ్రాలోనూ మల్టీప్లెక్స్‌లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 
 
ఫెడరేషన్... 
* చర్చలు తుది అంకంలోకి ప్రవేశించాయి. ఆమోదించబడిన, ఖరారు చేయబడిన రేట్ కార్డులు అన్ని చిత్ర నిర్మాణ సంస్థల కార్యాలయాలకు అందజేస్తారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments