Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమంత బాగా పెంచేసిందట... తగ్గేదేలే అంటోంది..

samantha
, శుక్రవారం, 26 ఆగస్టు 2022 (20:53 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
టాలీవుడ్ హీరోయిన్ సమంత 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్‌ వచ్చింది. యశోద, శాకుంతలం సినిమాలకు రూ.2.5 కోట్ల నుండి రూ.3కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. 
 
అయితే ఇప్పుడు కొత్త సినిమా చేయడానికి కోటి రూపాయలు ఎక్కువగా డిమాండ్‌ చేస్తోందట. సమంత ఇప్పటికే గుణశేఖర్‌ 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఆ తర్వాత తెలుగులో విజయ్‌ దేవరకొండతో 'ఖుషి' చేసింది. 
 
ఆ సినిమా కొత్త షెడ్యూల్‌ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. విజయ్‌ దేవరకొండకి 'లైగర్‌' షాక్‌ ఇవ్వడంతో.. కొన్నాళ్లు రెస్ట్‌ తీసుకొని వచ్చి కొత్త సినిమా మొదలుపెడతామన్నాడు. కాబట్టి ఈ సినిమా ఆలస్యమవుతుంది. ఇక మరో సినిమా 'యశోద' ఈ పాటికే విడుదలవ్వాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో హిలేరియస్ ఎంటర్ టైనర్ : హీరో శ్రీకాంత్ రెడ్డి