Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నమ్మ చనిపోతే.. సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా వున్నావా.. మంచు లక్ష్మీ..

మంచు లక్ష్మిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నానమ్మ చనిపోయిందని ట్వీట్ చేస్తూ.. తన సినిమా ట్రైలర్ కూడా జత చేయడం ప్రస్తుతం వివాదానికి తావిస్తోంది. మంచు మోహన్ బాబు తల్లి గురువారం ఉదయం కన్ను

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (15:11 IST)
మంచు లక్ష్మిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నానమ్మ చనిపోయిందని ట్వీట్ చేస్తూ.. తన సినిమా ట్రైలర్ కూడా జత చేయడం ప్రస్తుతం వివాదానికి తావిస్తోంది. మంచు మోహన్ బాబు తల్లి గురువారం ఉదయం కన్నుమూశారు. దీంతో మంచు కుటుంబం తిరుపతికి బయలుదేరింది. తన నానమ్మ చనిపోయిందని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. 
 
 దీనిపై స్పందించిన నెటిజన్లు షాక్ తిన్నారు. కానీ అదే సమయంలో మంచు లక్ష్మీ పెట్టిన ట్వీట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. తమిళంలో ఆమె నటించిన ''కాట్రిన్ మొయి'' అనే సినిమా ట్రైలర్ విడుదల కానుండడంతో ఆమె దీనికి సంబంధించి ఓ ట్వీట్ పెట్టింది. 
 
అంతటితో ఆగకుండా తమిళంలో తన తొలి సినిమా ట్రైలర్ చూడకుండా వుండలేకపోతున్నానని.. కాట్రిన్ మొయి ట్రైలర్ సాయంత్రం రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. ఇలాంటి విషాద సమయంలో ఆమె తన సినిమాను ప్రమోట్ చేస్తుండడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. నానమ్మ చనిపోయినా.. సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఎలా ఉంటున్నావంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments