Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో రజనీకాంత్ "వేట్టయన్" బాయ్ కాట్ ట్రెండింగ్

ఠాగూర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (19:05 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "వేట్టయన్". టేజీ జ్ఞానవేల్. ఈ నెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం టైటిల్‌పై సోషల్ మీడియాలో బాయ్‌కాట్ వేట్టయన్ టైటిల్ పేరుతో ఓ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. తెలుగు‌లో రిలీజ్ చేసేటప్పుడు తమిళ్ పేరు ఉండటం ఏమిటంటూ తెలుగు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్, దిల్ రాజు, రానా దగ్గుబాటిలు కలిసి రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ టైటిల్ వివాదంపై గురువారం రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు, రానా దగ్గుబాటి, సురేష్ బాబులు మాట్లాడారు. 
 
ముందుగా సురేష్ బాబు మాట్లాడుతూ, తెలుగులో చాలా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమాలు కూడా చాలా లాంగ్వేజ్‌లో డబ్ అవుతున్నాయి. ఓన్ ఇండియా వన్ నేషన్ అంటున్నారు కదా. తెలుగు "వేట్టయన్‌"ని అందరూ వచ్చి చూడండి. ఎప్పుడో వచ్చిన టైటానిక్ సినిమాను అదే టైటిల్‌తో ప్రపంచం అంతా చూసింది. అప్పుడు సినిమాలో పాట కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటే చూశారు. కాబట్టి ఇష్యూ చేయాలంటే అవుతుంది. బాహుబలి సినిమాను అందరు యాక్సెప్ట్ చేశారు. మనం‌ కూడా సినిమాలను అలానే చూడాలి అన్నారు. 
 
అలాగే, నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "వేట్టాయన్" అనే టైటిల్ తెలుగులో సోషల్ మీడియాలో కాంట్రవర్సీ చేస్తున్నారు. సినిమా గ్లోబల్ అయ్యింది.  సాధ్యమైనంత వరకు టైటిల్స్ లోకల్ పేరుతో పెడుతున్నారు. లేని పక్షంలో ఆ టైటిల్‌ని కంటిన్యూ చేస్తున్నారు. సినిమాని సినిమాగా చూడండి. పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కొన్ని లాంగ్వేజ్‌లలో టైటిల్ విషయంలో ఇష్యూస్ ఉంటాయి. గేమ్ చేంజర్ విషయలో కూడా రెండు మూడు లాంగ్వేజ్‌లలో ఇబ్బంది అయ్యింది అని అన్నారు. 
 
తర్వాత దగ్గుబాటి రానా మాట్లాడుతూ, రజనీ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా వుంటుంది. డైరెక్టర్ మీద ఇష్టంతో ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ వర్క్ చేశారు. ఈ రోజు మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం చూస్తుంది. ట్రోల్స్ అనేవి టైం పాస్ అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులపై నాలుగు కేసులు - ఎందుకో తెలుసా?

145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments