గత మూడురోజులుగా నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ టాలీవుడ్ లో ప్రముఖ హీరోలను, దర్శకులను కలుస్తున్నారు. తాజాగా నేడు మహేష్ బాబుతో కాఫీ భేటీ అయ్యారు. ఆ తర్వాత లంచ్ కు ప్రభాస్ ను కల్కి 2898 ఎ.డి. సెట్ లో కలిసి సినిమా విషయాలు చర్చించుకున్నారు. ఇది తెలుగు సినిమా రంగంలో ఒక మైలురాయిలా పలువురు పేర్కొంటున్నారు. నిన్ననే ఎన్.టి.ఆర్. ఈ భేటీ చాలా ఆనందంగా వుంది. సినిమా రంగంలో పెను మార్పులు రాబోతున్నాయని సూచాయగా చెప్పారు.
Netflix CEO Ted Sarandos with mahesh babu
నేడు మహేష్ బాబు టెడ్ సరండోస్ కు స్వాగతం పలికేందుకు తన నివాసంలో ఒక సంతోషకరమైన కాఫీ సెషన్‌ను నిర్వహించారు. నమ్రత శిరోద్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ బేటీలో వున్నారు. ఇక ప్రభాస్ సినిమా సెట్ లో దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ తదితరులు వున్నారు. వినోద పరిశ్రమ యొక్క ఉత్తేజకరమైన భవిష్యత్తు గురించి అంతర్దృష్టితో కూడిన సంభాషణలతో నిండిపోయింది అని ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.