Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్‌ బాస్‌' సీజన్-3లో నయనతార?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:12 IST)
బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో కోలీవుడ్ లేడీ అమితాబ్ నయనతార హోస్ట్‌గా నటించనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. కాకపోతే తెలుగు కాదండోయ్... తమిళ బిగ్ బాస్ 3కి ఈ అమ్మడు హోస్ట్‌గా వ్యవహరించబోతారా? అనేది ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు తమిళనాట ఉన్న తాజా వార్త.
 
వివరాలలోకి వెళ్తే... స్టార్ విజయ్‌ టీవీ నిర్వహిస్తున్న బిగ్‌ బాస్‌ షోకి సంబంధించిన గత సీజన్‌లో విశ్వనటుడు కమల్‌హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, త్వరలో ప్రారంభంకానున్న బిగ్‌బాస్‌ 3 సీజన్‌‌కి... ఇప్పటివరకు సదరు కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన కమల్‌హాసన్‌ ప్రస్తుతం రాజకీయాల్లోనూ, శంకర్‌ దర్శకత్వంలోని ‘భారతీయుడు 2’తోనూ బిజీగా ఉండడంతో హోస్ట్‌గా ఎవరిని నిర్ణయించాలనే సమస్య వచ్చిపడిందట. 
 
దీనితో ఈ సీజన్‌కి మరెవరైనా ప్రముఖ నటులను బిగ్‌ బాస్‌ షోలో నటింపజేసేందుకు నిర్వాహకులు పలువురితో సంప్రదింపులు జరిపారట. ఈ నేపథ్యంలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతారతో ఈ షోని చేయించేందుకు నిర్వాహకులు సంప్రదింపులు జరిపారు. అయితే నయనతార ప్రస్తుతం దక్షిణాదిన పలు భాషా చిత్రాలతో బిజీగా ఉండటంతో డేట్స్‌ కుదురుతాయో, లేదో వేచి చూడాల్సి వస్తోందంటున్నారు.
 
ఒకవేళ ఆవిడ నిరాకరిస్తే మాత్రం సూర్య, కార్తీలతో కూడా ఈ షోను నిర్వహించేందుకు చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుత సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments