Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వైఎస్ఆర్' భార్యగా తమిళ దర్శకుడి లవర్... ఓకే చెప్పిన కేరళ కుట్టి

మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారు.

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (15:52 IST)
మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారు. ఈ చిత్రంలో వైఎస్ఆర్ భార్యగా నటించేందుకు పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. అయితే, చిత్ర దర్శకుడు, నిర్మాత మాత్రం కేరళ కుట్టి నయనతారను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గతంలో మమ్ముట్టి - నయనతార కాంబినేషన్‌లో వచ్చిన 'భాస్కర్ ది రాస్కెల్', 'పుతియా నియమం' వంటి పలు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వైఎస్ఆర్ బయోపిక్‌ను నిర్మించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. 
 
కాగా, ఈ చిత్రానికి 'ఆనందో బ్రహ్మ' సినిమాతో హిట్ కొట్టిన మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. 
 
అలాగే, నయనతార తన ప్రియుడు తమిళ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి యూఎస్‌లో సమ్మర్ వెకేషన్స్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలను కూడా ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments