Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

చిత్రాసేన్
శనివారం, 4 అక్టోబరు 2025 (11:40 IST)
Nayanthara - Mahashakti
సుందర్ సి, నయనతార తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం మూకుతి అమ్మన్ 2. దీనికి తెలుగులో మహాశక్తి పేరు పెట్టారు. ఈ సినిమాకు దర్శకుడు కూడా సుందర్ సి. ఇందులో నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌ల గా నిర్మిస్తోంది. అవ్ని సినిమాక్స్ (పి) లిమిటెడ్, రౌడీ పిక్చర్స్ సహా నిర్మాతలు. మూకుతి అమ్మన్ పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించింది, తెలుగు డబ్బింగ్ వెర్షన్ అమ్మోరు తల్లికి  బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లభించింది.
 
మహాశక్తి చిత్రంలో నయనతారని అమ్మవారి రూపంలో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ పవర్ ఫుల్ గా వుంది. అన్ లిమిటెడ్ నవ్వులతో కూడిన ఎక్సయిటింగ్ కథాంశంతో వుంటుందని దర్శకుడు తెలియజేస్తున్నారు.
 
నయనతార లీడ్ రోల్ లో నటిస్తుండగా, దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగి బాబు, ఊర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్ ఘోష్, సింగం పులి, విచ్చు విశ్వనాథ్, ఇనియా, మైనా నందిని ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తున్నారు. గోపీ అమర్‌నాథ్ సినిమాటోగ్రాఫర్, ఫెన్నీ ఆలివర్ ఎడిటర్. వెంకట్ రాఘవన్ సంభాషణలు అందిస్తున్నారు, గురురాజ్ ఆర్ట్ వర్క్‌లను పర్యవేక్షిస్తున్నారు. రాజశేఖర్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments