Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సూర్య చిత్రంలో నటించి పెద్ద తప్పు చేశా: నయనతార

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (09:35 IST)
హీరో సూర్య నటించిన చిత్రం "గజని". అసిన్, నయనతారలు హీరోయిన్లుగా నటించగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే, ఈ చిత్రంలో నటించి తాను చాలా పెద్ద తప్పు చేశానని నయనతార ఇపుడు వాపోతోంది. 
 
ఇందులో నయనతార చిత్ర పాత్రలో నటించింది. 2005లో విడుదలైన ఈ చిత్రంలో తాను పోషించిన పాత్రపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో నటించడంపై ఆ తర్వాత పశ్చాత్తాప పడ్డానని చెప్పారు.
 
'ఈ సినిమాలో నా పాత్ర,  ఆసిన్ నటించిన కల్పన పాత్రతో సమానంగా ఉంటుందని అనుకున్నాను కానీ, అలా లేదు' అని నయనతార చెప్పుకొచ్చింది. 
 
మరోవైపు, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో బిజీగా ఉంటూ లేడీ అమితాబ్‌గా కొనసాగుతున్న నయనతార... ఇటీవల విడుదలైన 'సైరా నరసింహారెడ్డి'లో నటించారు. ఈ సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకున్నారు. 
 
తాజాగా ఆమె 'దర్బార్' చిత్రంలో హీరోయిన్‌గా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments