Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపీటలెక్కనున్న నయనతార, విఘ్నేశ్.. జూన్‌లో డుం.. డుం.. డుం..

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (11:55 IST)
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లిపీటలెక్కనుంది.  
 
నయన్‌, విఘ్నేష్‌ల పెళ్లికి ఇరుకుటుంబసభ్యులు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారని కోలీవుడ్ వర్గాల బోగట్టా. జూన్ నెలలో వీరి పెళ్లి జరుగబోతుందట. 
 
అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయని  ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇక తమ పెళ్లి గురించి నయన్‌, విఘ్నేష్‌ల నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
 
కాగా, ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార ఓ సినిమా చేసింది. అదే `కణ్మనీ రాంబో ఖతీజా. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించగా.. సమంత మరో హీరోయిన్‌గా చేసింది. 
 
కొద్ది రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 28న ఈ తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అలాగే నయనతార చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్‌ మూవీలో నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

దేవభూమి అనకనందా నదిలో పడిన మనీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

ప్రజాదర్బార్‌లో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు వినతులు వెల్లువ!!

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments