Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీన్ చంద్ర హీరోగా మ‌ధుబాల ప్ర‌ధాన పాత్ర‌గా చిత్రం ప్రారంభం

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (15:54 IST)
Madhubala, Navennchdra,Smruti
సర్వoత్ రామ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 9 చిత్రం గురువారం (జనవరి 28) పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి మధుబాల ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా.. మూవీ స్క్రిప్ట్‌ను సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిత్ర యూనిట్‌కు అందచేశారు. రాశి మూవీస్ అధినేత నరసింహారావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. చిత్ర దర్శకుడు అరవింద్ మొదటి షాట్‌కు యాక్షన్ చెప్పారు.
 
ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘అరవింద్‌గారు చెప్పిన ఈ థ్రిల్లర్ నాకు బాగా నచ్చింది. మధుబాలగారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంచి థ్రిల్లర్‌లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సర్వoత్ రామ్ క్రియేషన్స్‌లో రాబోతున్న మరో మంచి సినిమా ఇది. మరిన్ని మంచి చిత్రాల్లో నటించడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి..’’ అని తెలిపారు.
 
మధుబాల మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ అరవింద్ నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఈ సినిమాలో డీజీపీగా పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాను. చాలా కాలం తరువాత మంచి కథతో తెలుగులో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది..’’ అన్నారు.
 
హీరోయిన్ స్మృతి వెంకట్ మాట్లాడుతూ.. ‘‘ఈ పాత్రకు నన్ను సెలక్ట్ చేసినందుకు సర్వoత్ రామ్ క్రియేషన్స్‌ నిర్మాతగారికి, దర్శకుడికి ధన్యవాదాలు. మధుబాలగారితో నటించడం ఇట్స్ మై డ్రీమ్. సినిమా బ్యానర్ లాగే కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను..’’ అని తెలిపారు.
 
Madhubala, Navennchdra,Smruti,Arvind, Ramanjaneyulu
డైరెక్టర్ అరవింద్ మాట్లాడుతూ.. ‘‘సర్వoత్ రామ్ క్రియేషన్స్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మధుబాలగారు ఈ మూవీలో చాలా కీలక పాత్రలో నటిస్తున్నారు. నవీన్ చంద్రగారు మా స్క్రిప్ట్ నచ్చి ఈ మూవీ ఒప్పుకున్నారు. నిర్మాత నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరినీ అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది..’’ అన్నారు.
 
నిర్మాత రామాంజనేయులు జవ్వాజి మాట్లాడుతూ.. ‘‘ఈ కథ విని వెంటనే నవీన్ చంద్ర ఒప్పుకున్నారు. ఆయన నిర్మాతల హీరో అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ అరవింద్‌గారు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ కథను రాసుకున్నారు. మధుబాలగారు ఈ సినిమాలో నటించడం మరో పెద్ద ఎస్సెట్. ఫిబ్రవరి నుండి చెన్నైలో షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్‌లో ఎండ్ చేస్తాము. ఒకే షెడ్యూల్‌లో సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చెయ్యడానికి ప్లాన్ చేశాము. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం మరో హైలెట్ కానుంది’’ అని అన్నారు.
 
నటీనటులు:
నవీన్ చంద్ర, స్మృతి వెంకట్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో మధుబాల, రఘుబాబు, అచ్యుత్ కుమార్, సత్యం రాజేష్, మీమీ గోపి, పూజా రామచంద్రన్, సుదర్శన్, నవీన రెడ్డి, సిరి శ్రీ, ఆదర్శ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.
 
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: సర్వoత్ రామ్ క్రియేషన్స్
డైలాగ్స్: కెవి. రాజమహి
మేకప్: వినోద్
కాస్ట్యూమ్స్: గణేష్
స్టిల్స్: మని వణ్ణన్
పీఆర్ఓ: వంశీ శేఖర్
కో-డైరెక్టర్: ఎస్.యమ్. ఇళయరాజా, వరప్రసాద్.వి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రవి, డి.ఉమామహేశ్వర రాజు, దావల చిన్నా రావ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments