Webdunia - Bharat's app for daily news and videos

Install App

Naveen Chandra: మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నవీన్ చంద్ర షో టైం రాబోతోంది

దేవీ
మంగళవారం, 24 జూన్ 2025 (17:20 IST)
Naveen Chandra, Kamakshi Bhaskarla
నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల  హీరో హీరోయిన్ గా నటిస్తున్న వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం షో టైం. కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ప్రజెంట్ చేస్తున్నారు. 
 
ట్రయిలర్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా ఒక మర్డర్ చుట్టు అల్లుకున్న కథ అని ట్రయిలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రం థ్రిల్ ను పంచడంతో పాటు ఆద్యంతం కామెడీతో అలరించబోతుందని అర్థం అవుతుంది. ఇక కోర్ట్ రూమ్ డ్రామా, పోలీస్ ఇన్విస్టిగేషన్ సీన్లతో ఊపిరి బిగపట్టి చూసే ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రయిలర్ విడుదల కార్యక్రమంలో అతిథులు పాల్గొని మాట్లాడారు.
 
Naveen Chandra, Kamakshi Bhaskarla, Kishore Garikipati, Madan Dakshinamurthy, Raja Ravindra
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ, చాలా మంచి సినిమా చేసినప్పుడు ఆసక్తితో పాటు ఉత్సాహం, భయం కూడా ఉంటుంది. డైరెక్టర్ మదన్ తో పని చేయడం, ఎడిటర్ శరత్, డీఓపీ వినోద్ శ్రమ ఎంతో ఉందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర చక్కటి నేపథ్యాన్ని సమకూర్చారు. రాజరవీంద్ర, సీనియర్ నరేష్ తో పని చేయడం చాలా సరదగా అనిపించింది. సినిమాపై ఎంత నమ్మకంతోనే అనిల్ ప్రెజెంట్ చేశారు. నాకు తెలిసింది సినిమా ఒక్కటే, కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమాలనే చేస్తా. ఇక షో టైం సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుందని చెప్పారు.
 
దర్శకుడు మదన్ దక్షిణామూర్తి మాట్లాడుతూ, పరిశ్రమలో ఒక పెద్ద వ్యక్తి సినిమా చూసి ఇది రియల్ షో టైం అని చెప్పారు అని చెప్పారు. దాంతో సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మకం వచ్చిందని చెప్పారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.
 
దాము మాట్లాడుతూ..మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర అద్భుతమైన టెక్నిషన్ అన్నారు. ఈ సినిమాకు కచ్చితంగా ప్రాణం పెట్టి పనిచేశారు అని చెప్పారు. నవీన్ చంద్ర గొప్ప నటుడు అని చెప్పారు. షో టైం తో ఇంకా మంచి పేరు రావాలని కోరారు. సినిమా జులై4 న విడుదల అవుతుంది అందరూ ఆదరించాలని కోరారు. ఎవరు పైరసీని ప్రోత్సహించవద్దు అని కోరారు. 
 
పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వానాథ్ మాట్లాడుతూ.. 28 డిగ్రీ సెల్సీయస్ సినిమాలో హీరో నవీన్ చంద్ర, పొలిమేర సినిమాలో హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇద్దరితో తను పని చేసాను అని ఇద్దరి సూపర్ యాక్టర్స్ అన్నారు. అలాగే దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇద్దరికి బెస్ట్ యాక్టర్స్ అవార్డులు రావడం, వారు ఇద్దరు ఈ సినిమాలో నటించడం చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పారు.
 
హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ, చిన్న సినిమా కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమా. నవీన్ చంద్ర ఒక అద్భుతమైన నటుడు. ఆయన్ను అభిమానించే నేను తనతో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments