Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వక్ సేన్ లాంచ్ చేసిన నారాయణ & కో ట్రైలర్

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (18:11 IST)
Sudhakar Komakula
హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’ జూన్ 30న విడుదల కానుంది. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.  ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశారు.
 
''నెక్స్ట్ టెన్ డేస్ లో చాలా పెద్ద డీల్ వుంది. దుబాయ్ నుంచి ముంబాయికి ఒక పిల్లి బొమ్మ వస్తుంది. దాన్ని చాలా సేఫ్ గా మన దగ్గరకు చేర్చాలి'' అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది.
 
నారాయణ కుటుంబంలో పాత్రలన్నీ చాలా వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. ట్రైలర్ లోచెప్పినట్లు  నారాయణ & కో  ధెడ్ దిమాక్  & తిక్కల్ బ్యాచ్. ట్రైలర్ అన్ లిమిటెడ్ ఫన్ ని అందించింది. ట్రైలర్ చివర్లో పిల్లి బొమ్మ చుట్టూ నడిపిన సన్నివేశాలు హిలేరియస్ కామెడీని అందించాయి.
 
సుధాకర్ కోమాకుల తనదైన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. దేవి ప్రసాద్ ,ఆమనీ పాత్రలు కూడా మంచి వినోదాన్ని పంచాయి. నేపధ్య సంగీతం ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి  ‘’నారాయణ & కో ట్రైలర్.. ఈ చిత్రం అన్ లిమిటెడ్ ఫన్ రైడ్ అని భరోసా ఇచ్చింది.
 
సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్  సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments