Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

దేవీ
సోమవారం, 2 జూన్ 2025 (15:07 IST)
Sai Kumar, Prithvi Amber
డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రస్తుతం ఏ చిత్రంలో నటిస్తే ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్‌ హిట్లుగా నిలిచాయి. ఇక ఆయన నటించిన కమిటీ కుర్రోళ్లు, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, మెర్సీ కిల్లింగ్ వంటి చిత్రాలకు గద్దర్ అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి సాయి కుమార్ ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో ‘చౌకీదార్’ అనే సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా నటిస్తున్నారు. 
 
‘చౌకీదార్’ మూవీని వీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డా. కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మిస్తుండగా.. చంద్రశేఖర్ బండియప్ప తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాన్న గొప్పదనం చాటి చెప్పేలా గుండెను పిండేసేలా ఓ చక్కటి బాణీని అందించారు. నాన్నా అంటూ సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. సచిన్ బస్రూర్ అందించిన బాణీ అయితే ప్రతీ ఒక్కరినీ కదిలించేలా ఉంది.
 
తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, చూపించే ప్రేమను చాటేలా పాటను రచించారు. ఇక లిరికల్ వీడియో చూస్తుంటే సాయి కుమార్ తండ్రిగా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నారు. పృథ్వీ అంబర్, సాయి కుమార్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉండేట్టుగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

Banakacherla: గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించిన ఏపీ చంద్రబాబు

PM Modi: 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. రికార్డ్ బ్రేక్

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments