Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా?

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (22:02 IST)
నేచురల్ స్టార్ నాని ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నాడు. నిర్మాతగా అ అనే విభిన్న కథా చిత్రాన్ని నిర్మించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే.. అ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం కమర్షియల్‌గా ఆశించిన స్ధాయిలో సక్సస్ సాధించలేదు. అయినప్పటికీ నిర్మాతగా మరో సినిమాని నిర్మించాడు. అదే హిట్. ఈ చిత్రంలో ఫలక్ నూమాదాస్ సినిమాతో సక్సస్ సాధించిన విశ్వక్ సేన్, చిలసౌ సినిమాతో విజయం సాధించిన రుహానీ శర్మ జంటగా నటించారు. 
 
శైలేష్ కొలను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇటీవల రిలీజైన హిట్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుని సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమా ఎండింగ్‌ని సీక్వల్ ఉంటుంది అన్నట్టుగా ముగించారు. ఇదే విషయం గురించి డైరెక్టర్ శైలేష్ కొలను అడిగితే... హిట్ సినిమాకి సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుంది. వెంట‌నే తెర‌కెక్కిస్తాను. ప్ర‌స్తుతం దాని పైనే వ‌ర్క్ చేస్తున్నాం అని చెప్పారు. 
 
సేమ్ టీమ్‌తో వ‌ర్క్ చేయ‌బోతున్నాను. మ‌రికొన్ని పాత్ర‌లు యాడ్ అవుతాయి. 2021లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం అన్నారు. మే చివ‌ర లేదా జూన్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ చేయాల‌నుకుంటున్నామని... నాని గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న‌కు స‌రిపోయే క‌థ నాకు ఐడియాకు వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఆయ‌న‌తో సినిమా చేస్తాను అని చెప్పారు. 
 
ఇక హిట్ సినిమా కథ ఎలా పుట్టిందో చెబుతూ..  థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ రాయాల‌ని అనుకున్న త‌ర్వాత ప్ర‌పంచంలో జ‌రిగిన క్రైమ్స్ గురించి వార్తా ప‌త్రిక‌ల్లో చ‌దివానని... ఆస‌క్తిక‌ర‌మైన కేసులన్నింటినీ తన డైరీలో రాసుకుంటూ వ‌చ్చాను అని చెప్పారు. 
 
నిజ ఘ‌ట‌నల‌ను క‌లిపి రాసుకున్న క‌థే ఈ హిట్‌ అని అన్నారు. క‌మ‌ల్‌హాస‌న్‌ గారి హేరామ్ సినిమా వ‌ల్ల‌నే తను సినిమాల్లోకి రావాల‌ని అనుకున్నానని... ఆ సినిమాను ఇప్ప‌టివ‌ర‌కు 50 కంటే ఎక్కువ‌సార్లు చూశాను. ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈ సినిమాలో క‌నిపించింద‌నుకుంటాను అని చెప్పారు. 
 
నాని హీరో, నిర్మాత కాబట్టి ఈ సినిమాకి సలహాలు ఏమైనా ఇచ్చారా అంటే.. చిన్నచిన్న స‌ల‌హాలు ఇచ్చారు. అస‌లు స‌న్నివేశాల‌ను ఎందుక‌లా రాసుకున్నాన‌నే ఉద్దేశాన్ని తెలుసుకున్నారు తప్పితే... పెద్దగా సలహాలు ఏమీ ఇవ్వలేదు. 
 
98 పర్సంట్ నేనెదైతే రాసుకున్నానో దాన్నే సినిమాగా తీశాను అని డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పారు. మరి నాని హీరోగా మీ డైరెక్షన్లో సినిమా ఎప్పుడు అంటే... నాని గారికి తగ్గ కథ రెడీ అయినప్పుడు ఖచ్చితంగా ఆయనతో సినిమా చేస్తాను అన్నారు. తన దగ్గర నాలుగు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఈ నాలుగు కథలు కూడా డిఫరెంట్ స్టోరీసే అని చెప్పారు. మరి.. ఈ యంగ్ డైరెక్టర్ హిట్ సీక్వెల్‌తో కూడా హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

Chandrababu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. ఎన్డీయే సమావేశంలో హాజరు.. వాటిపై చర్చ

మియాపూర్‌లో తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన ముజిగల్‌

PV Sindhu: మా ప్రేమ విమానంలో మొదలైంది..తొలి చూపులోనే పడిపోయాం... పీవీ సింధు

Kazakhstan: కజకిస్తాన్‌‌లో కూలిన విమానం.. 72మంది మృతి - పక్షుల గుంపును ఢీకొనడంతో? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments