Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానుల పొగడ్తలను ఏమాత్రం నమ్మను... స్టార్ డైరక్టర్స్‌కే ఛాన్స్ : నాని

వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఎందుకంటే నాని ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న హీరో. తను నటిస్తున్న ప్రతి చిత్రం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంద

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:46 IST)
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఎందుకంటే నాని ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న హీరో. తను నటిస్తున్న ప్రతి చిత్రం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. 2008లో విడుదలైన ‘అష్టా చమ్మా’ నుండి నాని మంచి కథలనే సెలక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మధ్యలో కొన్ని ప్లాపులు పలకరించినా… ప్రస్తుత హిట్స్ ముందు అవి లెక్కలోని రాకుండా పోయాయి. ''ఈగ'' వంటి బ్లాక్ బస్టర్ నానికి మంచి పేరుని తీసుకువచ్చింది. 
 
ఇప్పటివరకూ కొత్త కథలకి, కొత్త దర్శకులకి అవకాశం ఇచ్చిన నాని…. ఇక నుంచి కేవలం పెద్ద డైరెక్టర్స్‌తోనే పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ అంతా, నానికి కథలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నాని సైతం వారితో మూవీలను చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, సరదాగా సినిమాలపై మాట్లాడిన నాని అభిమానులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కేవ‌లం అభిమానుల్ని న‌మ్ముకొని సినిమాలు తీయ‌లేమ‌ని… అభిమానులైనంత మాత్రానా మనం ఏ సినిమా చూసినా గుడ్డిగా చూసేయ‌ర‌ని.. సినిమా బాగుంటేనే చూస్తార‌ని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాదు.. అభిమానుల పొగ‌డ్త‌ల్ని కూడా న‌మ్మ‌ను అంటున్నాడు. దానికు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. రెండు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డిన ''జెండాపై క‌పిరాజు'' సినిమా ఆడ‌లేదు కానీ.. ఆరు నెల‌ల్లో పూర్తి చేసిన ''భ‌లే భ‌లే మ‌గాడివోయ్'' పెద్ద హిట్ అయ్యిందని ఈ హీరో అంటున్నాడు. ప్ర‌స్తుతం నాని త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ''నేను లోక‌ల్'' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments