Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణబీర్‌ను లాగి చెంపపై కొట్టిన అనుష్క శర్మ.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వ‌ర్య రాయ్, అనుష్క శ‌ర్మ, ర‌ణ‌బీర్ న‌టిస్తున్న ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ ''యే దిల్ హై ముష్కిల్''. క‌ర‌ణ్ జోహార్ డైర‌క్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాకిస్థాన్ సూప‌ర్ స్టార్ ఫ‌హ‌ద్ ఖాన్ ఓ ము

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:10 IST)
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వ‌ర్య రాయ్, అనుష్క శ‌ర్మ, ర‌ణ‌బీర్ న‌టిస్తున్న ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ ''యే దిల్ హై ముష్కిల్''. క‌ర‌ణ్ జోహార్ డైర‌క్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాకిస్థాన్ సూప‌ర్ స్టార్ ఫ‌హ‌ద్ ఖాన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ట్ర‌యాంగిల్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రేమికుల భావోద్వేగాలు ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసేలా ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియో సాంగ్ రిలీజైన తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇటీవల విడుదలైన బుల్లయ్యా సాంగులో ఎక్కువగా ఐశ్వర్యరాయ్‌నే ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్‌లో మేజర్ పోర్షన్ అనుష్క శర్మ ఫోకస్ చేసినా… చివర్ల కొంత సేపు కనిపించే ఐశ్వర్యరాయ్ లుక్ ఎక్కువగా ఆకట్టుకుందని ట్రైలర్ చూసిన వారు అభిప్రాయ పడుతున్నారు. 
 
ఐశ్వర్యరాయ్ ఇంత హాటుగా ఎప్పుడూ లేదని, ఈ సినిమాలో ఆమె తన సెన్సేషనల్ రొమాంటిక్ లుక్‌తో అభిమానుల మనసు దోచుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్-రణబీర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సినిమాలో హైలెట్ కానున్నాయి. ఇదిలాఉంటే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. రణ్‌బీర్‌కపూర్‌ చెంప ఛెళ్లుమనిపించిందట అనుష్క శర్మ. 
 
అయితే ఇది రియల్‌గా కాదు. రీల్‌గా.''యే దిల్‌ హై ముష్కిల్‌'' సినిమాలో చాలా హాట్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లు కూడా వున్నాయి. ఇందులో ఓ సీన్‌లో రణబీర్‌ను చెంపదెబ్బ కొడుతుంది అనుష్క . అయితే ఈ సీన్‌లో తగలాల్సిన స్ట్రోక్ కంటే గట్టిగానే తగిలిందట. దీంతో మనోడు నొచ్చుకున్నాడట. చాలా గట్టిగా కొట్టేసావ్ అని ఫీల్ అయ్యాడు. దీంతో జరిగిన పొరపాటుకి సారీ కూడా చెప్పింది అనుష్క. ఈ సినిమాకి సంబధించిన మేకింగ్ వీడియో‌లో ఇదంతా రికార్డ్ అయ్యింది. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments