Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని MCA, అఖిల్ Hello... 2018 న్యూ ఇయర్ హీరో ఎవరో?

ఈ క్రిస్మస్‌కి సినిమాల సందడి నాలుగు రోజుల ముందే మొదలవబోతోంది. ఇందులో మొదటగా నాని నటించిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) ఈ నెల 21వ తేదీన రిలీజు కానుంది. నాని ఈ సంవత్సరం ఇప్పటికే 'నేను లోకల్', 'నిన్ను కోరి'

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (20:17 IST)
ఈ క్రిస్మస్‌కి సినిమాల సందడి నాలుగు రోజుల ముందే మొదలవబోతోంది. ఇందులో మొదటగా నాని నటించిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) ఈ నెల 21వ తేదీన రిలీజు కానుంది. నాని ఈ సంవత్సరం ఇప్పటికే 'నేను లోకల్', 'నిన్ను కోరి' సినిమాలతో హిట్లు అందుకున్నా, ఈసారి హ్యాట్రిక్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అందులో 'ఫిదా' ఫే‌మ్ సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. వీరిరువురు మంచి ఫామ్‌లో ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
మరోవైపు నాగార్జున రెండో తనయుడు అఖిల్ కూడా 'హలో' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి 22వ తేదీన థియేటర్లలోకి రానున్నాడు. మొదటి సినిమా 'అఖిల్‌'ని ప్రముఖ హీరో నితిన్ 50 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయేసరికి రెండో చిత్రమైన హలోపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు అక్కినేని వారసుడు. 
 
ఈ సినిమా తనకు అతి ముఖ్యమైన మలుపుగా భావించవచ్చు, ఎందుకంటే నాగార్జున ఈ సినిమాని స్వయంగా తానే నిర్మిస్తూ తన వారసుడి హిట్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మనం సినిమాలో అక్కినేని కుటుంబాన్ని ఒకే ఫ్రేమ్‌లో చూపిన దర్శకుడు విక్రమ్.కె.కుమార్ ఈ సినిమానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కళ్యాణి ప్రియదర్శని హీరోయిన్‌గా చేస్తున్నారు. 
 
ఇవే కాకుండా అల్లు శిరీష్ నటించిన 'ఒక్క క్షణం', అడివి శేష్ నటించిన 'గూఢచారి' సినిమాలు కూడా క్రిస్మస్‌కి విడుదల కానున్నాయి. ఇలా చాలారోజుల తర్వాత తెలుగు సినిమాలు వరుసగా బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమయ్యాయి. వీటిలో ఏది విజయం సాధిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments