Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుషీలో కుర్రకారును చిత్తుచిత్తు చేసిన భూమిక చివరికి ఇలా సెటిలయింది...

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ఎంసీఏ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా వున్న సినీ యూనిట్ ఓ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనను వదినగా నటించిన భూమ

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (19:37 IST)
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ఎంసీఏ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా వున్న సినీ యూనిట్ ఓ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనను వదినగా నటించిన భూమిక గురించి చెప్పుకొచ్చారు. 
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, భూమిక నటించిన ''ఖుషీ'' సినిమా టిక్కెట్ల కోసం లైన్‌లో నిలబడకుండా.. వేరే లైన్‌ను క్రియేట్ చేసినందుకు పోలీసులు తనను చితక్కొట్టారని చెప్పాడు. అలాంటి హీరోయిన్‌ తనకు వదినగా నటిస్తున్నప్పుడు ఎంతో ఎగ్జైట్‌గా ఫీలయ్యానని నాని వ్యాఖ్యానించాడు. 
 
ఖుషీ సినిమా టిక్కెట్ల కోసం తన్నులు తిన్న విషయాన్ని భూమికకు చెప్తే ఆమె నవ్వుకున్నారని.. ఈ సినిమా షూటింగ్ తమను ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా మార్చేశాయని చెప్పాడు. సినిమా పూర్తయ్యేలోపు ఆవిడ తనకు సొంత వదినలా మారిపోయారని తెలిపాడు. వాళ్లబ్బాయి కోసం షాపింగ్ చేసేటప్పుడు, మా అబ్బాయికి కూడా బొమ్మలు కొని తెచ్చేవారని తెలిపాడు.
 
ఇదిలా ఉంటే.. హ్యాట్రిక్ విజ‌యాలతో మంచి ఊపుమీద ఉన్న నాని న‌టిస్తున్న తాజా చిత్రం ఎంసీఏ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వి నటిస్తుంది. ఈ చిత్రంలో భూమిక.. నానికి వదినగా కనిపించబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments