Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోయ్‌నా.. హోయ్‌నా..హోయ్‌నా..’ నాని 'గ్యాంగ్‌ లీడర్‌’ రెండో పాట విడుదల

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (20:00 IST)
నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. 
 
ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ‘రారా.. జగతిని జయించుదాం..’ అంటూ సాగే మొదటి పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ అలరించడానికి రెడీ అవుతున్న ‘నాని’స్‌ గ్యాంగ్‌లీడర్‌’ చిత్రంలోని ‘వేరే కొత్త భూమిపై ఉన్నానా.. ఏదో వింత రాగమే విన్నానా.. హోయ్‌నా.. హోయ్‌నా..హోయ్‌నా..’ అంటూ సాగే రెండో పాటను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్‌ 15న విడుదల చేశారు.
 
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారులో భార్య, ఆమె పక్కనే ప్రియుడు, కారు బానెట్ పైన మొగుడు (video)

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments