Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు అమ్మాయిలకు గ్యాంగ్ లీడర్‌గా నాని..

Webdunia
గురువారం, 16 మే 2019 (16:28 IST)
తాజాగా విడుదలైన జెర్సీ చిత్రంతో మంచి ఫామ్‌లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం విక్రమ్ కే కుమార్‌తో గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన లుక్‌ను, అలాగే టీజర్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, ఇందులో నాని ఐదుగురు మహిళలకు లీడర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే ఆ ఐదుగురు అమ్మాయిలు దొంగలుగా ఉంటారని సమాచారం. నాని వారికి నాయకుడిగా కనిపించి సందడి చేయనున్నాడట. ప్రతి చిత్రంలోనూ విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నాని ఈ చిత్రంతో అభిమానులను మరింత ఎంటర్టైన్ చేయనున్నాడట. 
 
నాని-విక్రమ్ కుమార్ కాంబోలో వస్తున్న గ్యాంగ్ లీడర్ చిత్రం నాని కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. మరోవైపు నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments