Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 'కత్తి'కి ఏమైంది? 'సత్తు' కత్తి అవుతుందా? లేక 'మొద్దు'కత్తి అవుతోందా?

మన పెద్దలు చెప్పినట్లు... ఎంత బలహీనుడుగా వున్నా అవతలి వ్యక్తి చాలా బలంగా వుంటే, అతడితో ఢీకొంటే వచ్చే కిక్కే వేరు. అదేనండే మన భాషలో అయితే వచ్చే పాపులారిటీ చాలా చాలా కిక్కుస్తుంటుంది కొందరికి. ఇప్పుడు అ

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (19:13 IST)
మన పెద్దలు చెప్పినట్లు... ఎంత బలహీనుడుగా వున్నా అవతలి వ్యక్తి చాలా బలంగా వుంటే, అతడితో ఢీకొంటే వచ్చే కిక్కే వేరు. అదేనండే మన భాషలో అయితే వచ్చే పాపులారిటీ చాలా చాలా కిక్కుస్తుంటుంది కొందరికి. ఇప్పుడు అలాంటి కిక్కులోనే క్రిటిక్ అని చెప్పుకునే కత్తి మహేష్ చేరిపోయారా అనే అనుమానం వస్తుంది. సహజంగా సినిమాలు ఎలా వున్నాయని చెప్పే 'సత్తు' కత్తి కాస్తా ఇపుడు జావగారి జారిజారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైపుకు చేరి 'మొద్దు' కత్తిలా మారిపోతున్నారేమోనన్న విమర్శలు వస్తున్నాయి. 
 
సినిమాల గురించి చెబితే ఫర్లేదు కానీ ఇటీవల ఆయన టార్గెట్ చేస్తున్న అంశాలను చూస్తుంటే కత్తి రివర్స్ అయ్యిందేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొన్నగాక నిన్న పవన్ దేవుడా... ఐతే ఎందుకు ఆయన ఫ్యాన్సును నిలువరించరు అని ప్రశ్నించిన కత్తి మళ్లీ తాజాగా నంది అవార్డుల్లోకి దూరిపోయారు. కమ్మ, కాపు సామాజిక వర్గాలంటూ కమ్యూనిటీ తేనెతుట్టెను కదిలించి దాదాపు తేనెటీగలను మరోసారి బాగా పనిపెట్టినట్లు కనిపిస్తున్నారు. 
 
ఆయన ట్వీట్ చేస్తూ.. ‘‘అయినా కమ్మోళ్ళ రాజ్యంలో కాపులకు ఎందుకండి అవార్డులు!!! మీ కాపు సామ్రాజ్యం పవన్ కళ్యాణ్ తెచ్చేదాకా ఆగలేరా? మెగా ఫ్యామిలికి అప్పుడు పంచుకొండి పప్పులు బెల్లాలు’’ అని కత్తి మహేష్ మెగా అభిమానులను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ ఇప్పుడు టెంపర్ పెంచేశాయి మరోసారి. మరి ఆయన ట్వీట్ పైన ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments