Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స్పై థ్రిల్ల‌ర్ డెవిల్ లో సంయుక్త లుక్

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (17:34 IST)
Devil - samyukth look
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఈ మూవీలో క‌ళ్యాణ్ రామ్ జోడీగా సంయుక్త నటిస్తోంది. సోమవారం (సెప్టెంబ‌ర్ 11) ఆమె పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా డెవిల్ చిత్రంలో సంయుక్త పోషించిన నైష‌ధ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.
 
పోస్ట‌ర్‌ను గమనిస్తే.. కొబ్బ‌రికాయ‌, పువ్వులు అన్నింటినీ తీసుకుని గుడిలో పూజకు వెళుతున్న అమ్మాయిగా ప్లెజంట్‌ లుక్‌లో సంయుక్త ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో డెవిల్ సినిమాను  న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది ‘డెవిల్’తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు.
 
దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌కుడిగా.. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే యువకుడితో తల్లీ కుమార్తె అక్రమ సంబంధం - అతనితో కలిసి భర్త హత్య!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రీ షెడ్యూల్- ఫిబ్రవరి 4న ప్రారంభం

Kolkata: గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్జీ కాలేజీ వైద్య విద్యార్థిని.. కారణం?

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments