చిత్రీకరణ తుది దశలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ చిత్రం

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (16:45 IST)
Kalyan Ram, Rajendra Reddy
వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్నకథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్. రీసెంట్‌గా విడుద‌లైన బింబిసార చిత్రంతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను సాధించిన క‌ళ్యాణ్ రామ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు.
 
క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.  జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.
 
న‌టీన‌టులు:
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, ఆషిక రంగ‌నాథ్‌, బ్ర‌హ్మాజీ, స‌ప్త‌గిరి, జ‌య‌ప్ర‌కాష్‌, మాథ్యూ వ‌ర్గీస్‌, రాజీవ్ పిళ్లై, ర‌వి ప్ర‌కాష్‌, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ‌, ర‌ఘు కారుమంచి, మాణిక్ రెడ్డి, గబ్బ‌ర్ సింగ్ సాయి, శ్రీధ‌ర్‌, అశోకన్‌ విన్సెంట్, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments