Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావమరిది పాడె మోసిన నారా చంద్రబాబు.. ప్రచార రథంతో యాత్ర

నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ పాడెను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, హరికృష్ణ బావమరిది అయిన నారా చంద్రబాబు నాయుడు మోసారు.

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (14:55 IST)
నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ పాడెను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, హరికృష్ణ బావమరిది అయిన నారా చంద్రబాబు నాయుడు మోసారు. గురువారం 2 గంటల సమయంలో మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు.
 
ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడెను మోశారు. పాడెకు ముందు ఎన్టీఆర్ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు విషణ్ణవదనంతో ముందునడిచారు. ఈ అంతిమ యాత్రకు నందమూరి అభిమానులేకాకుండా స్థానికులు కూడా భారీ ఎత్తున తరలివచ్చి.. హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. 
 
ఆ తర్వాత హరికృష్ణ భౌతికకాయాన్ని వైకుంఠ రథం (ప్రచార రథం) ఎక్కించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకోగానే ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments