Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణను దేవుడు పిలిచాడు... వెళ్లాడు.. అంతే : వైవీఎస్ చౌదరి

సీటు బెల్టు పెట్టుకునివుంటే నందమూరి హరికృష్ణ బతికి ఉండేవారంటూ అనేక మంది చేస్తున్న వ్యాఖ్యలపై సినీ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి స్పందించారు. ఇపుడు సీటు బెల్టు గురించి మాట్లాడటం అనవసరమన్నారు.

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (14:18 IST)
సీటు బెల్టు పెట్టుకునివుంటే నందమూరి హరికృష్ణ బతికి ఉండేవారంటూ అనేక మంది చేస్తున్న వ్యాఖ్యలపై సినీ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి స్పందించారు. ఇపుడు సీటు బెల్టు గురించి మాట్లాడటం అనవసరమన్నారు.
 
బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో హరికృష్ణతో 'సీతయ్య', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి సూపర్ హిట్ చిత్రాలను వైవీఎస్ చౌదరి నిర్మించారు. 
 
ఈ పరిస్థితుల్లో ఆయన ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ, హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టారు. సీటు బెల్టును హరికృష్ణ పెట్టుకోలేదని ఇప్పుడు మాట్లాడటం అనవసరమన్నారు. 
 
హరికృష్ణ చిన్నతనం నుంచే అన్ని రకాల వాహనాలనూ నడిపేవారని గుర్తు చేసిన ఆయన, అప్పటి వాహనాల్లో సీట్ బెల్ట్ ఉండేది కాదని, దాంతో ఆయనకు అలవాటు కాలేదని చెప్పారు. పైగా, సీటు బెల్టు పెట్టుకుంటే, తనను కట్టేసినట్టుగా అనిపిస్తుందని ఆయన చెప్పేవారని వైవీఎస్ చౌదరి అన్నారు. 
 
కానీ, ఆయన తర్వాత వచ్చి, కార్లను కొనుక్కున్న తనకు, హరికృష్ణ కొడుకులకు సీటు బెల్టు అలవాటేనని చెప్పారు. ఎవరికీ ప్రమాదాలు జరగాలని ఉండదని, హరికృష్ణను దేవుడు పిలిచాడని అభిప్రాయపడ్డారు. సీటు బెల్టు గురించి మాట్లాడటం వృథా అని అన్నారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments