నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి షూటింగ్ పూర్తి

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (19:15 IST)
balakrishnaph
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనిల భారీ చిత్రం 'వీరసింహారెడ్డి' జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌ కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎస్ థమన్ సంగీతం అందించిన 'జై బాలయ్య' ఫస్ట్ సింగిల్ కూడా చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది.
 
ఇదీలావుండగా  సినిమా షూటింగ్ పూర్తయింది. టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా, ఒక్క పాట మాత్రమే షూటింగ్‌ కి మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి  రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. ఎక్కడ?

బలహీనపడిన దిత్వా తుఫాను.. ఏపీకి తప్పని భారీ వర్ష ముప్పు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments