Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న బాలయ్య నర్తనశాల రిలీజ్ : టిక్కెట్ ధర ఎంతంటే.....?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (09:45 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన మరుపురాని చిత్రం నర్తనశాల. ఈ చిత్రం అంటే సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, హీరో బాలకృష్ణకు కూడా అమితమైన ఇష్టం. అందుకే తాను హీరోగా "నర్తనశాల" చిత్రాన్ని ప్రారంభించారు. ద్రౌపదిగా సౌందర్య, ధర్మరాజుగా శరత్ బాబు, భీముడుగా శ్రీహరి, అర్జునుడు పాత్రలో బాలయ్య నటిస్తూ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే, హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోవడంతో, పలు కారణాల వల్ల చిత్ర షూటింగ్ ఆగిపోయింది. 
 
అయిత, ఇపుడు ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ నెల 24వ తేదీ విజయదశమి పండుగను పురస్కరించుకుని దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా రిలీజ్ చేయనున్నారు. 
 
దీన్ని ఓటీటీ ద్వారా విడుద‌ల‌ చేయనున్నారు. అయితే, ఈ సినిమా చూడాలంటే రూ.50 పెట్టి టికెట్ కొనాల్సిందే. ఈ సినిమా ద్వారా వ‌చ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్ర‌మాల‌కు ఉప‌యోగించాల‌ని బాల‌కృష్ణ భావించారు. 
 
బాల‌య్య అభిమానులైతే ఎంతైనా పెట్టి టికెట్ కొన‌వ‌చ్చున‌ని అన్నారు. దీంతో కొంత మంది అభిమానులు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు పెట్టి టిక్ కొనాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. వారి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments