Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త చిత్రం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (15:44 IST)
Naven, Balakrishna, Gopichand Malineni, Ravi
అఖండ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టిసింహా నంద‌మూరి బాల‌కృష్ణ, క్రాక్ వంటి సక్సెస్‌ఫుల్ త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో బాల‌య్య‌107వ సినిమాగా  ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.
 
ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ నేడు సిరిసిల్ల టౌన్‌ (తెలంగాణ)లో ప్రారంభమైంది. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ని మొద‌లుపెట్టారు మేక‌ర్స్‌. బాలకృష్ణ - ఫైటర్స్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు.
 
మాస్ హీరో మ‌రియు మాస్ ద‌ర్శ‌కుడు ఇద్దరూ కలిసి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమాతో మంచి ట్రీట్ ఇవ్వ‌నున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.
 
బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ ద్వారా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్  తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు.
 
న‌వీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాట‌లు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌ఫ‌ర్‌, నవీన్ నూలీ ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్, దునియా విజ‌య్, వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్‌
 
సాంకేతిక బృందం
 
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్:  గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: తమన్ ఎస్
డీఓపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్ :  రామ్‌- లక్ష్మణ్
సీఈవో : చెర్రీ
కో డైరెక్టర్:  కుర్రా రంగరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రహ్మణ్యం కేవీవీ
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments