Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలపై కేసులు నమోదు చేయండి : నాంపల్లి కోర్టు ఆదేశం

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (12:13 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు హీరోలపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. ఒకరి విక్టరీ వెంకటేష్ అయితే మరొకరు ఆయన అన్న దగ్గుబాటి సురేష్ కుమారుడు, హీరో రానా దగ్గుబాటి. అలాగే, సురేష్ దగ్గుబాటి, అభిరామ్ దగ్గుబాటిలపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసినందుకు వీరిపై కేసుల నమోదుకు కానున్నాయి.
 
ఈ కిచెన్ యజమాని నందకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి డెక్కన్ కిచెన్‌ హోటల్‌ను కూల్చివేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే బిల్డింగ్‌ను ధ్వంసం చేసి ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లారని నందకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు, పోలీసులతో కుమ్మక్కైన వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్‌లు హోటల్‌ను కూల్చివేశారని తెలిపారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను ధ్వంసం చేశారన్నారు. దీనివల్ల తనకు రూ.20 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ హోటల్ కూల్చివేతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో వెంకటేష్, రానాతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments