Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ హీరో వేణు ఇంట విషాదం.. ఏం జరిగింది?

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (11:49 IST)
తెలుగు హీరో తొట్టెంపూడి వేణు ఇంట విషాదం జరిగింది. ఆయన తండ్రి తొట్టెంపూడి సుబ్బారావు మృతి చెందారు. ఆయన వయసు 92 యేళ్లు. అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. 
 
ఆయన భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ వద్ద బంధువుల సందర్శనార్థనం ఉంచుతారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్విహంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేణు తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. 

సహజీవనం చేస్తున్న వ్యక్తితో వచ్చే నెలలో వివాహం.. అంతలోనే యువతి ఆత్మహత్య!
 
హైదరాబాద్ నగరంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాను సహజీవనం చేస్తున్న వ్యక్తితో వచ్చే నెల 12వ తేదీన వివాహం జరగాల్సివుంది. అంతలోనే ఆ యువతి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రానికి చెందిన అదితి భరద్వాజ్ (34) గత కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి స్థిరపడింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే ఆమె గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుని, విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మణికొండలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తనతో కలిసి పని చేసే చింతల్‌మెట్‌కు చెందిన మహ్మద్ అలీతో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో అతడు అత్తాపూర్ ఠాణా పరిధిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో ఓ అపార్టు‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని అందులో అదితిని ఉంచారు. వీరిద్దరూ వచ్చే నెల 12వ తేదీన వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
అయితే, గత రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లిన అదితి గర్భందాల్చినట్టు వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆమె ఆదివారం తెల్లవారుజామున మహ్మద్ అలీకి ఫోన్ చేసి తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు చెప్పారు. దీంతో అతడు హుటాహుటిన ఫ్లాట్‌కు చేరుకునే సమయానికి ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీనిపై మహ్మద్ అలీ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అదితి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ ప్రముఖులే సాఫ్ట్‌కార్నర్‌గా మారుతున్నారు : తెలుగు ఫిల్మ్ చాంబర్

జనసేన సనాతన ధర్మం డిక్లరేషన్: తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

వైవాహిక అత్యాచారాన్ని నేరం కాదు.. అలాగని మహిళా స్వేచ్ఛ కాపాడుతాం.. కేంద్రం

రైల్వే ఉద్యోగులకు ముందుగానే దీపావళి : 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం

ప్రీ-వెడ్డింగ్ షూట్.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన జంట.. నెట్టింట విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments