టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ దేవదాస్. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పైన అశ్వనీదత్ నిర్మించిన దేవదాస్ అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సెకండ్ వీక్‌లో కూడా అన్ని ఏరియాల్లో విశేష ప్రేక్షకాదరణతో మూవీ రన్ అవుతుండటం విశేషం. ఓవర్సీస్‌లో కలెక్షన్స్.. 1 మిలియన్‌కి చేరువలో ఉన్నాయి.