Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇద్దరు హీరోయిన్లు' కావాలంటున్న చైతు.. ఓకే చెప్పిన డైరెక్టర్!

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (11:49 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న యువ హీరోల్లో నాగ చైతన్య ఒకరు. స్టార్ హీరో అక్కినేని నాగార్జున తనయుడుగా అక్కినేని వంశం నుంచి మూడో తరం హీరో. ఈ యువ హీరో ఖాతాలో ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. లోగడ వచ్చిం 'ఏమాయ చేశావే', ఫ్యామిలీ హీరోలు నటించిన 'మనం' చిత్రాలు మినహా మిగిలిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఈ దఫా సరైన హిట్ కొట్టాలన్న సంకల్పంతో ముందుకుసాగుతున్నాడు. 
 
ఈ క్రమంలోభాగంగా, తమిళ దర్శకుడు విక్రంకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేసేందుకు సమ్మతించాడు. ఈ దర్శకుడు వైవిధ్యమైన కథా చిత్రాలకు పెట్టింది పేరు. గతంలో అక్కినేని కుటుంబ హీరోలతో 'మనం' వంటి కొత్తతరహా చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. 
 
ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని అక్కినేని నాగ చైతన్యతో చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ చిత్రానికి 'థ్యాంక్యూ' అనే పేరుని వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. 
 
ఇకపోతే, ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. వీరిలో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్‌ని ఇప్పటికే ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. మరో కథానాయిక పాత్రకు తమిళ ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్‌ను తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట.
 
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇతర నటీనటుల ఎంపిక కూడా పూర్తికావచ్చింది. అక్టోబర్ మొదటి వారం నుంచి షూటింగును నిర్వహించాలని షెడ్యూల్స్ వేస్తున్నారట. గతంలో చైతూ, రకుల్ కలసి 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు మరోసారి కనువిందు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments