ప్రియుడిని గాఢంగా ప్రేమించింది. ఎలాగో పెళ్ళి చేసుకుంటాం కదా అని అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. హోటల్ గదులు తీసుకుని ఎంజాయ్ చేయడం ప్రారంభించింది. ఇలా ఎంజాయ్ చేస్తూ ముగ్గురు యువకులకు అడ్డంగా బుక్కయ్యింది.
గురుగ్రామ్‌కు చెందిన ఒక యువతి ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అక్కడే పనిచేసే ఒక యువకుడితో ప్రేమాయణం సాగించింది యువతి. తరచూ రెస్టారెంట్లకు వెళ్ళడం.. గదిని అద్దెకు తీసుకోవడం లాంటివి చేస్తూ ప్రియుడితో బాగా ఎంజాయ్ చేసేది.
అయితే కరోనా సమయంలోను వీరు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. గదిని అద్దెకు తీసుకోవడం.. శృంగారంలో మునిగితేలడం చేసేవారు. అయితే వీరు గదిని అద్దెకు తీసుకున్న పక్క రూములోనే రూపేష్, శంకర్, రాజా అనే ముగ్గురు యువకులు ఉన్నారు.
వీరిద్దరూ సరససల్లాపాల్లో మునిగితేలుతున్న సమయంలో వారి సెల్ ఫోన్లో చిత్రీకరించారు. మొత్తం శృంగార లీలలను చిత్రీకరించి ఆ యువతి చిరునామా కనుక్కుని ఆసుపత్రికి వెళ్ళి బెదిరించారు. దీంతో ఎక్కడ పరువు పోతోందోనని గత 15 రోజుల నుంచి యువకులు ఎక్కడికి పిలిస్తే అక్కడకు వెళ్ళేది యువతి.
వారు ఇదే అదునుగా ఆమెను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. వారి వేధింపులను తట్టుకోలేక నిన్న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఒక లేఖ రాసింది. దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.