Publish Date: Sun, 19 Jul 2020 (10:15 IST)
Updated Date: Sun, 19 Jul 2020 (10:16 IST)
కరోనా మహమ్మారి తెలంగాణలో శరవేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చుట్టేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఫలితం లేకుండా పోతుంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ నేతలను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ నేతల గన్‌మెన్స్, పిఏలకు ఇలా కరోనా సోకింది.
తాజాగా.. వరంగల్ మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో గన్‌మెన్‌తో పాటు సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, పలువురు కార్పొరేటర్లు క్వారంటైన్‌లో ఉన్నారు. గత పదిరోజులుగా మేయర్‌తో కలిసి తిరిగిన, సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు టెస్ట్‌లు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. కాగా.. మేయర్ దంపతులు ఎక్కడ వైద్యం తీసుకుంటున్నారనే విషయం తెలియరాలేదు.
సెల్వి
Publish Date: Sun, 19 Jul 2020 (10:15 IST)
Updated Date: Sun, 19 Jul 2020 (10:16 IST)