Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మోరు', 'అరుంధతి'లా... నాగభరణంను ఆదరిస్తున్నారు.. కలెక్షన్స్ అదుర్స్

'నాగభరణం' చిత్రం చక్కటి ఓపెనింగ్స్‌ను సాధిస్తోంది. అమ్మోరు, అరుంధతి స్థాయిలో గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు అని నిర్మాత మల్కాపురం శివకుమార్ అన్నారు. రమ్య, దిగంత్, సాయికు

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (18:31 IST)
'నాగభరణం' చిత్రం చక్కటి ఓపెనింగ్స్‌ను సాధిస్తోంది. అమ్మోరు, అరుంధతి స్థాయిలో గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు అని నిర్మాత మల్కాపురం శివకుమార్ అన్నారు. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నాగభరణం'. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 
 
ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 353 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశాం. త్వరలో మరికొన్ని థియేటర్లను పెంచనున్నాం. తొలి రోజున ఈ సినిమాకు కోటి యాభై రెండు లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. రెండు రోజున కోటి పన్నెండు లక్షల రూపాయల కలెక్షన్స్‌ను సాధించింది. 
 
మూడు రోజుల్లో నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంటుందని భావిస్తున్నాం. విడుదలైన అన్ని చోట్ల సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది. గ్రాఫిక్స్ హంగులతో పతాక ఘట్టాల్లో విష్ణువర్ధన్‌ను పునఃసృష్టించిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తున్నాయి. విజయం దిశగా సినిమా దూసుకుపోతుండటం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ చిత్రానికి మహిళా ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ అద్భుతంగా వుంది అని ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments