Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి గోపీచంద్‌, బి.గోపాల్‌ సినిమా టైటిల్‌ .. ఫస్ట్ లుక్

మాస్‌ చిత్రాల దర్శకుడు బి.గోపాల్‌, గోపీచంద్‌తో చేస్తున్న సినిమా టైటిల్‌ ప్రకటించనున్నారు. కొద్దికాలంగా విరామం ఇచ్చిన ఈ చిత్రం షూటింగ్‌ మరలా కొనసాగుతోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (18:21 IST)
మాస్‌ చిత్రాల దర్శకుడు బి.గోపాల్‌, గోపీచంద్‌తో చేస్తున్న సినిమా టైటిల్‌ ప్రకటించనున్నారు. కొద్దికాలంగా విరామం ఇచ్చిన ఈ చిత్రం షూటింగ్‌ మరలా కొనసాగుతోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూర్చారు. చిత్రం గురించి నిర్మాత తాండ్ర రమేష్‌ మాట్లాడుతూ గోపీచంద్‌, నయనతార కాంబినేషన్‌లో బి.గోపాల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. 
 
దాదాపు షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్ర టైటిల్‌ను ఫస్ట్‌లుక్‌ను దీపావళికి విడుదల చేయబోతున్నాం. పాటలను నవంబర్‌లోనూ సినిమాను డిసెంబర్‌లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు నిర్మాణానాంతర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. సీనియర్‌ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారని తెలిపారు. 
 
ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్‌, ఉత్తేజ్‌, జయప్రకాష్‌ రెడ్డి, రమాప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ, అబ్బూరి రవి సంభాషణలు రాస్తున్నారు. కెమెరా: బాలమురుగన్‌, ఫైట్స్‌: కణల్‌ కన్నన్‌. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments