Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్రలో 'చిన్నారి'

కన్నడ నటుడు ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్రలో న‌టించిన చిత్రం `చిన్నారి`. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య‌, మ‌ధుసూద‌న్ ప్రధాన పాత్రధారులు. కె.ఆర్‌.కె. ప్రొడ‌క్షన్, ల‌క్ష్మీ వెంక‌టేశ్వర మూవీస్ సంయుక

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (18:17 IST)
కన్నడ నటుడు ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్రలో న‌టించిన చిత్రం `చిన్నారి`. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య‌, మ‌ధుసూద‌న్ ప్రధాన పాత్రధారులు. కె.ఆర్‌.కె. ప్రొడ‌క్షన్, ల‌క్ష్మీ వెంక‌టేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. కె.ర‌వికుమార్‌, ఎం.ఎం.ఆర్ నిర్మిస్తున్నారు. 
 
తెలుగు, క‌న్నడంలో ఏక‌కాలంలో రూపొందించారు. లోహిత్ దర్శకత్వం వ‌హించారు. ఈ చిత్రం ప్రోగ్రెస్‌పై నిర్మాత‌లు మాట్లాడుతూ... హార‌ర్ చిత్రమిది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. గోవా నేప‌థ్యంలో క‌థ జ‌రుగుతుంది. షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. 
 
`రంగి త‌రంగి`కి సంగీతం చేసిన అజినీష్ లోక్‌నాథ్ చ‌క్కటి బాణీల‌ను ఇచ్చారు. కన్నడలో టాప్‌ కెమెరామెన్ వేణు ఫోటోగ్రఫీ చేశారు. హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌, ఆర్.ఆర్ మెప్పిస్తాయి. 22 ఏళ్ల కుర్రాడు లోహిత్ చాలా బాగా దర్శకత్వం చేశాడు. సెన్సార్‌కు సిద్ధమవుతోంది. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేస్తామని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments